గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (14:37 IST)

స్విగీలో న్యూడిల్స్‌ ఆర్డర్ చేస్తే.. రక్తపు మరకతో బ్యాండేజ్ వచ్చింది..

ఉద్యోగాలు, హడావుడి జీవన విధానంతో హాయిగా ఇంట్లో వంట చేసుకుని పుష్టిగా తినే వారి సంఖ్య తగ్గిపోతుంది. అంతేగాకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని ఇంటి రప్పించి తెగ లాగిచే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుని డోర్ డెలివరీ చేసేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో స్విగీ ఒకటి. 
 
ఇంతకుముందు ఉబెర్ డ్రైవర్ కస్టమర్ల కోసం తీసుకెళ్లే ఆహారాన్ని టేస్ట్ చేసి తర్వాత డెలివరీ చేసి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా స్విగీ ద్వారా న్యూడుల్స్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కి షాకే మిగిలింది. ఎందుకంటే.. న్యూడిల్స్‌లో రక్తపు మరకతో కూడిన ఓ బ్యాండేజ్ వుండటమే. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన బాలమురుగన్ అనే వ్యక్తి స్విగీలో న్యూడిల్స్ ఆర్డర్ చేశాడు. 
 
ఆర్డర్ ఏకంగా ఇంటికే తెప్పించుకుని.. న్యూడిల్స్‌ను తినేందుకు మొదలెట్టాడు. అయితే ఆ న్యూడిల్స్‌లో రక్తంతో కూడిన ఓ బ్యాండేజ్ వుండటం చూసి షాకయ్యాడు. ఆపై న్యూడిల్స్ ప్యాక్‌ను ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అంతేగాకుండా సంబంధిత హోటల్‌పై ఫిర్యాదు చేశాడు. 
 
ఈ ఫిర్యాదుకు సదరు హోటల్ వివరణ ఇచ్చింది. ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేసే వ్యక్తి చేతికి గాయం ఏర్పడిందని.. ఈ గాయానికి వేసిన బ్యాండేజ్ ఆహారంలో కలిసిపోయిందని.. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని క్షమాపణలు అడిగింది. అయినా ఈ చర్యపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవడం కంటే.. హ్యాపీగా ఇంట్లోనే కుక్ చేసుకుని తీసుకోవడం చాలా మేలని సలహా ఇస్తున్నారు.