గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:25 IST)

వాట్సాప్‌లో పిలిస్తే వచ్చేసింది... ఫుల్లుగా డిన్నర్ పెట్టించి ఆపై...

వాట్సప్‌లో పరిచయం అయిన మహిళపై రెండుసార్లు లైంగిక దాడి చేశాడు ఓ కామాంధుడు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు వివరాల్లోకి వెళితే... దుబాయ్‌లో అల్ అయిన్ ప్రాంతంలో నివాసముంటున్న ఫిలిఫైన్స్‌కు చెందిన మహిళకు నెల రోజుల క్రితం వాట్సప్‌లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. చాట్‌లో సంభాషించుకున్నారు. తనతో డిన్నర్ చేయడానికి రమ్మని ఆహ్వానించాడు. ఆమె అతడిని నమ్మింది. ప్రపోజల్‌కి ఓకే చెప్పింది. 
 
రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్ చేయడానికి రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఓ కేఫ్‌కు వెళ్లారు. డిన్నర్ ముగిసిన తర్వాత ఇంటి దగ్గర విడిచిపెడతానని నమ్మబలికి కార్లో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఆ ప్రాంతంలో ఆమెపై రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడా చెప్పవద్దని చెప్పి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. తన స్నేహితురాలి సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులకు జరిగిందంతా చెప్పింది. తను ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నానని చెప్పింది. పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి తమ కంపెనీలో వేరే బ్రాంచీలో పనిచేస్తున్నాడని అతడితో వాట్సాప్‌లో పరిచయం ఏర్పడిందని చెప్పింది. డిన్నర్‌కి వెళదామని రమ్మంటే నమ్మి అతడితో వెళ్లానని చెప్పింది. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా తాను అసలు అత్యాచారానికి పాల్పడలేదని ఆమే తనకు ముద్దులు పెట్టిందని ఫోటోలు చూపించాడు. పోలీసులు వాటిని మార్ఫింగ్ ఫోటోలుగా తేల్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో కూడా అతడు ఆమెపై లైంగిక దాడి చేసినట్లు రుజువైందని పోలీసులు తెలిపారు.