శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (10:53 IST)

ప్రేక్షకులే భక్తులు.. నేను బస్సును నడిపే డ్రైవర్‌ను : కళాతపస్వి (టీజర్)

తెలుగు చిత్ర పరిశ్రమలో హిమాలయా పర్వతమంత ఎత్తులో ఉండే దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్. పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా విశ్వదర్శనం అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జనార్థన్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్‌ ప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. 'వందేళ్ల వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ల బంగారు దర్శకుడి కథ' అన్న లేడీ వాయిస్ డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. రాధికా శరత్‌కుమార్‌, సుశీల, భానుప్రియ, ఆమని, శైలజ, విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు విశ్వనాథ్‌ గొప్పతనం గురించి టీజర్‌లో వివరించారు.
 
ఈ టీజర్‌లో యంగ్ విశ్వనాథ్‌కు సంబంధించిన అలనాటి ఫొటోలను అద్భుతంగా చూపించారు. 'సినిమా అనే ఓ బస్సును పట్టుకుని, సినిమా చూసేవారు ప్రేక్షకులను భక్తులుగా భావించి.. నేను బస్సు నడిపే డ్రైవర్‌ను. ఏం చేయాలి నేను?' అంటూ టీజర్ ఆఖర్లో విశ్వనాథ్‌ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.