గురువారం, 14 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 మే 2025 (18:16 IST)

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

rajnath singh
ఆపరేషన్ సింధూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధృవీకరించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని, ఇంకా ముగియలేదని కూడా రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పీఓకేలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, దేశ భద్రత విషయంలో ఎలాంటి చర్యలకైనా సిద్ధం అని స్పష్టం చేశారు.
 
పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని, సరిహద్దులో పరిస్థితి ఇంకా అలానే ఉందని రక్షణ మంత్రి నాయకులకు తెలియజేసినట్లు వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారని, ఆపరేషన్ సిందూర్ గురించి అందరికీ వివరించారని, అందరు నాయకులు తమ సూచనలను అందించారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

భద్రతకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది తాము విన్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేము ప్రభుత్వం వెంట ఉన్నామని చెప్పినట్లు ఖర్గే వెల్లడించారు.