సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (13:11 IST)

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేసిన తొలి సీఎం కేసీఆరే..

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓ ముఖ్యమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కేబినెట్ ఏర్పాటు ఆలస్యం కావడంతో పద్దుల లెక్కలన్నీ సీఎం కేసీఆర్ చూస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. 
 
రాష్ట్రంలో సంచార జాతి కులాల వారిని ఆదుకోవడం కోసం ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేశామని.. ఎంబీసీ కార్పోరేషన్ కోసం ఈ బడ్జెట్‌లో రూ.1000కోట్లు కేటాయించామని కేసీఆర్ ప్రకటించారు. 28వేల మెగావాట్ల లక్ష్యంగా ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 
 
రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కేవలం 7780 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే ఉంది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ కృషి వల్ల 16300మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని కేసీఆర్ ప్రకటించారు. ఇంకా ఏప్రిల్ నెలాఖరు నాటికి వందకు వంద శాతం మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇంటింటికి నీళ్లు ఇస్తామని ప్రకటించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కింద ఇప్పటివరకు 2లక్షల పైచిలుకు ఇళ్లను నిర్మించామని.. సొంత పద్దతిలో ఇళ్లు నిర్మించుకునేవారికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.