బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:44 IST)

పుల్వామా ఘటన అమానుషం.. అమరుల కుటుంబానికి రూ.25లక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా సాధారణ పరిపాలన శాఖతో పాటు ఆర్థిక శాఖ కూడా సీఎం వద్దే ఉండడంతో బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెడుతున్నారు. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కేబినెట్ ఏర్పాటు ఆలస్యం కావడంతో పద్దుల లెక్కలన్నీ కేసీఆరే చూసుకుంటున్నారు.. దీంతో బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రవేశపెడుతున్నారు. 
 
ఈ బడ్జెట్‌లో భాగంగా ఒక్కో అమరుల కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ వెల్లడించారు. ఈ పాశవిక చర్యను తెలంగాణ అసెంబ్లీ ఖండిస్తోందంటూ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. 
 
పుల్వామాలో జరిగిన దాడి అమానుషం, హేయమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు ఆయన సంతాపం తెలిపారు. దేశ రక్షణ కోసం 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.