బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (19:03 IST)

4 బంతుల్లో రెండు పరుగులు.. ధోనీ వల్లే టీమిండియా ఓడిందా?(Video)

హామిల్టన్ వేదికగా జరిగిన మూడో ట్వంటీ-20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధీటుగా రాణిస్తాడని.. తద్వారా సులభంగా జట్టును గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ధోనీ నాలుగు బంతుల్లో రెండు పరుగులే తీయడం ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది. దీంతో ధోనీ ఆటతీరుపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.


కానీ ఈ వీడియో వింటే ధోనీపై ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేయరనే చెప్పాలి. ధోనీకి హామిల్టన్ మ్యాచ్ 300వ ట్వంటీ-20. ఇంకా ధోనీ కెప్టెన్ హోదాలో అత్యధిక ట్వంటీ-20 మ్యాచ్‌లను కూడా ఆడాడు. 
 
ఇంకా కెప్టెన్ హోదాలో అత్యధిక విజయాలు అంటే 150 మ్యాచ్‌ల విజయాన్ని నమోదు చేసుకున్న రికార్డు కూడా ధోనీపైనే వుంది. అలాగే కీపర్‌గానూ అత్యధిక మ్యాచ్‌లాడిన రికార్డు కూడా ధోనీ ఖాతాలో వుంది. భారత క్రికెటర్‌గా అత్యధిక టీ-20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడి గానూ ధోనీ రికార్డు సృష్టించాడు. తద్వారా ఆసియా దేశాల్లో అత్యధిక టీ-20లు ఆడిన క్రికెటర్ల జాబితాలో ధోనీ రెండో స్థానంలో నిలవగా, ప్రపంచ క్రికెటర్ల జాబితాలో 13వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 
 
తాజాగా హామిల్టన్ మ్యాచ్‌లో సైఫర్‌ను ధోనీ స్టంప్ అవుట్ చేయడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పాడు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మ్యాచ్‌ల్లో స్టంపింగ్ చేసిన భారతీయ క్రికెటర్‌గా 34 స్టంపింగ్‌లతో అగ్రస్థానంలో వున్నాడు. కీపర్‌గా వుంటూ ధోనీ 230 మందిని అవుట్ చేసివున్నాడు.

అలాగే టీ-20 స్ట్రైక్ రేట్ ఆటగాళ్ల జాబితాలో ధోనీ మూడో స్థానంలో వున్నాడు. కానీ హామిల్టన్‌లో వికెట్ కీపింగ్‌లో అదరగొట్టిన ధోనీ.. బ్యాటింగ్‌లో మాత్రం రాణించలేకపోయాడు. అయినప్పటికీ ధోనీ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనా.. ఇప్పటికే మహీపై వున్న రికార్డులతో సరిపెట్టుకుంటున్నారు. 
 
ఈ మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. హామిల్టన్ మ్యాచ్‌లో కివీస్ నుంచి పోటీని ఎదుర్కొన్నామని.. వారి బ్యాటింగ్ బాగున్నా.. తమ జట్టు క్రికెటర్లు ధీటుగానే రాణించారని.. బ్యాటింగ్‌లో తమ క్రికెటర్లు మెరుగ్గా ఆడినా.. నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవడం నిరాశ కలిగించిందని చెప్పాడు.

అయితే టీమిండియా గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయిందని.. ధోనీ బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నందున ఆ స్థానంలో వేరొక ఫామ్‌లో వున్న బ్యాట్స్‌మన్‌ను తీసుకుంటే.. మెరుగైన ఫలితాలుండేవని క్రికెట్ ఫ్యాన్స్ కొందరు అభిప్రాయపడుతున్నారు. హామిల్టన్ మ్యాచ్‌లో ధోనీ మెరుగ్గా రాణించి వుంటే టీమిండియా నెగ్గేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.