శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (15:52 IST)

కివీస్‌తో రెండో వన్డే.. 90 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

న్యూజిలాండ్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మౌంట్ మాంగనుయ్‌లో శనివారం జరిగిన రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 325 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ బ్యాట్‌మెన్ విఫలమయ్యారు. ఫలితంగా 40.2 ఓవర్లలోనే 234 పరుగులకు కివీస్ ఆలౌటైంది. 
 
భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మరోసారి సత్తాచాటి.. నాలుగు వికెట్లతో కివీస్ వెన్నువిరిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 324పరుగులు సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 87, ధావన్ 66, కోహ్లీ 43, అంబటి రాయుడు 47, ధోనీ 48, జాధవ్ 22 పరుగులు చేశారు. 
 
కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫెర్గ్యూసన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. కివీస్ బ్యాట్స్‌మెన్‌లలో  బ్రేస్ వెల్ మాత్రమే 57 పరుగులు చేసి భారత బౌలింగును ధీటుగా ఎదుర్కొన్నాడు.
 
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, భువనేశ్వర్ కుమార్ 2, చాహల్ 2 వికెట్లు తీయగా... షమీ, జాధవ్ లు చెరో వికెట్ పడగొట్టారు. భారత్ విజయంలో కీలకపాత్రను పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.