భారత్-కివీస్‌ల మధ్య రెండో వన్డే.. అదరగొట్టిన భారత బ్యాట్స్‌మెన్
భారత్-కివీస్‌ల మధ్య ఐదు వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగ మౌంట్ మాంగనూయిలో జరుగుతున్న రెండో వన్డే భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో కివీస్‌ను చిత్తు చేసిన భారత్, రెండో వన్డేలోనూ అదే ఊపుతో బరిలోకి దిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. పక్కా వ్యూహంతో కివీస్ బరిలోకి దిగినప్పటికీ.. భారత ఓపెనర్లు బ్యాటింగ్‌లో అదరగొట్టారు. ఫలితంగా టీమిండియా భారీ స్కోర్ దిశగా కొనసాగుతోంది.
ఓపెనర్లు శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు తొలి బంతి నుంచే బ్యాట్‌తో విరుచుకుపడ్డారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వన్డేల్లో 27వ అర్థసెంచరీని ధావన్ పూర్తి చేసుకున్నాడు. కానీ బౌల్ట్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తం 67 బంతులు ఎదుర్కొన్న ధావన్ 9 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు.
ధావన్ అవుటైనా రోహిత్ శర్మ జోరు తగ్గలేదు. కానీ రోహిత్ శర్మ 96 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లున్నాయి. తర్వాత కోహ్లీ (43), రాయుడు (47) ధీటుగా రాణించారు. ప్రస్తుతం ధోనీ (34), జాదవ్ (2) క్రీజులో వున్నారు. ఫలితంగా 48.1 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్ల పతనానికి 294 పరుగులు సాధించింది.