శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (10:13 IST)

సిడ్నీ టెస్ట్ : జోష్ మీదున్న బౌలర్లు.. పట్టుబిగిస్తున్న భారత్

సిడ్నీ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్‌పై భారత్ పట్టు బిగిస్తోంది. వికెట్ నష్టపోకుండా రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 24 పరుగులతో మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు... లంచ్ ప్రారంభానికి ముందు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోగా, ఆ తర్వాత నాలుగు వికెట్లను కోల్పోయింది. దీంతో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. 
 
ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో హారీస్ (79), లుబేషేన్ (38), మార్ష్ (8), ట్రావిస్ హెడ్ (20), హ్యాండ్స్ కోంబ్ (21), టిమ్ పైన్ (5) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు రెండేసి వికెట్లు తీయగా, షమీకి ఓ వికెట్ దక్కింది. భార‌త్ స్కోర్‌ని స‌మం చేయాలంటే ఆస్ట్రేలియా మరో 424 ప‌రుగులు చేయాల్సి ఉంది. 
 
కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 622 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసిన విషయం తెల్సిందే. భారత్ ఇన్నింగ్స్‌లో ఛటేశ్వర్ పుజారా 193 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 159 (నాటౌట్) పరుగులు చేశాడు. అలాగే, మయాంక్ 77, రాహుల్ 9, కోహ్లీ 23, రహానే 18, విహారి 42 చొప్పున పరుగులు చేశారు.