శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (12:09 IST)

ఇక చాలు.. కోహ్లీ నుంచి పింక్ బంతిని లాక్కున్న అంపైర్.. ఎందుకు?

భారత్-ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో.. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్ 77 పరుగులు సాధించాడు. మయాంక్ అవుట్ కావడంతో కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. తొలుత నిలకడగా ఆడిన కోహ్లీ.. హెసుల్‌వుడ్ బౌలింగ్‌కు లెగ్ సైడ్‌లో బౌండరీ కొట్టపోయాడు. ఆ బంతి కాస్త కెప్టెన్ పైనీ వద్దకు చేరుకుంది. 
 
తదనంతరం 52వ ఓవర్ చివర్లో అపైర్ నుంచి బంతిని తీసుకున్న కోహ్లీ.. పింక్ బ్యాట్‌తో కొట్టి కొట్టి ఆడుకోవడం మొదలెట్టాడు. దీన్ని చూసి విసుక్కున్న అంపైర్ కోహ్లీ నుంచి బంతిని లాక్కున్నాడు. కోహ్లీ చేసిన ఈ సిల్లీ గేమ్.. వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాగా.. సిడ్నీలో జరుగుతున్న ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌‍లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. దీంతో తొలిరోజు మొత్తం ఆసీస్ పై భారత్ పైచేయి సాధించింది.