శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (11:26 IST)

పాముపై వయ్యారంగా స్వారీ చేసిన కప్పలు.. (ఫోటో)

పాములకు, కప్పలకు అస్సలు పడవనే సంగతి తెలిసిందే. కప్పలు కనిపిస్తే చాలు.. పాములు గబుక్కున మింగేస్తుంటాయి. అలాంటిది.. పాముపై కప్పలు స్వారీ చేశాయంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. ఆస్ట్రేలియాలో విచిత్రం చోటుచేసుకుంది. ఈ విచిత్రానికి సంబంధించిన ఫోటోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాను ఓ తుఫాను తాకింది. ఆ సమయంలో తన భార్యతో నివసించిన పాల్ మాక్ అనే వ్యక్తి ఓ విచిత్ర ఫోటోను తన ఫోన్‌లో తీశాడు. తుఫాను కారణంగా పలు కప్పలు గడ్డిపై నిలిచిపోయాయి. ఆ కప్పలు.. అటుగా వెళ్తున్న పాముపై ఎక్కి వయ్యారంగా స్వారీ చేశాయి. ఈ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేయడం.. ఆ ఫోటో కాస్త వైరలై కూర్చోవడం జరిగిపోయాయి. మీరూ ఆ ఫోటోను ఓ లుక్కేయండి.