జియో న్యూ ఇయర్ బంపర్ ఆఫర్... 100% క్యాష్ బ్యాక్

Jio-Offer
Last Modified శుక్రవారం, 28 డిశెంబరు 2018 (19:30 IST)
కొత్త సంవత్సరం 2019 రాబోతోంది. ప్రతి ఏడాది తన వినియోగదారులకు జియో గిఫ్టులు ఇస్తూనే వుంటుంది. ఈ ఏడాది కూడా తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త ఆఫర్ వివరాలు ఇలా వున్నాయి. రూ.399 రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు వంద శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

AJio కూపన్ రూపంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు తెలిపింది. కస్టమర్లు మై జియో యాప్‌లో తమ జియో నంబర్‌కు రీఛార్జ్ చేసుకోవడం తెలిసిందే. అలాగే రూ.399తో రీచార్జ్ చేసుకుంటే రిలయెన్స్ వెంటనే రూ.399 కూపన్‌ను మై కూపన్స్ సెక్షన్‌కు యాడ్ చేస్తుంది.

ఆ తర్వాత ఈ కూపన్‌ను ఎజియో యాప్ లేదా వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంటుంది. ఈ కూపన్‌ను కనీసం రూ.1000 కొనుగోలు చేయడం ద్వారా వాడుకోవచ్చు. ఈ ఆఫర్ అందరికీ వర్తిస్తుంది. కాగా ఇది ఇవాళ్టి నుంచి.. అంటే శుక్రవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్ జనవరి 31, 2019 వరకు అందుబాటులో వుంటుంది. కూపన్లను మార్చి 15 లోపు రీడీమ్ చేసుకోవాలి.దీనిపై మరింత చదవండి :