మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 29 డిశెంబరు 2018 (21:29 IST)

కొండపైన కళ్యాణిని నలిపేశారు.. ఎవరు.. ఎందుకు.?(Video)

తిరుమలలో విఐపిలు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. విఐపిలు ఫ్రీగా దొరికేది ఇదే ప్రాంతంలోనే కాబట్టి భక్తులు వారితో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తిరుమల శ్రీవారిని విఐపి విరామ దర్శనా సమయంలో ముగ్గురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. అందులో ఇద్దరు కమెడియన్లు కాగా, మరొకరు హీరోయిన్.
 
కోట శ్రీనివాసులతో పాటు వెన్నెల కిషోర్, హీరోయిన్ కళ్యాణిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖులతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు అభిమానులు. ముఖ్యంగా నటి కళ్యాణితో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. 
 
20 మందికి పైగా అభిమానులు కళ్యాణి చుట్టూ గుమిగూడి సెల్ఫి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే మొదట్లో సెల్ఫీలు సహకరించిన కళ్యాణి ఆ తరువాత అభిమానులు తన మీదకు వస్తూ ఇబ్బంది పెట్టడంతో జరుగు జరుగు అంటూ దూరంగా వెళ్ళిపోయారు. అభిమానుల అతి అభిమానం కారణంగా ఆమె కాస్త ఇబ్బందిపడ్డారు. వీడియో చూడండి