టెన్త్ క్లాస్ అబ్బాయిని పెళ్ళి చేసుకోనున్న రాఖీ సావంత్
రాఖీ సావంత్. బాలీవుడ్ సెక్సీ క్వీన్. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. అదీ కూడా టెన్త్ క్లాస్ చదివిన ఓ కుర్రోడిని. ఆ అబ్బాయి పేరు దీపక్ కలాల్. ముంబైలోని ఓ త్రీస్టార్ హోటల్‌లో ఉద్యోగం చేస్తూ బాలీవుడ్‌లో సినిమా అవకాశాలు దక్కించుకున్న మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇతగాడిని రాఖీ సావంత్ పెళ్లాడనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
వీటిని నిజం చేసేలా, రాఖీ సావంత్ ఇపుడు దుబాయ్‌లో షాపింగ్‌లో మునిగిపోయింది. తనకు ఇష్టమైన బంగారపు నగలతో పాటు.. పెళ్లిలో ధరించాల్సిన నగలను ఆమె కొనుగోలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను దీపక్ కలాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఈ ఖాతాలో దీపక్‌కు దాదాపు 65 వేలకు పైగా ఫాలోయర్స్ ఉండటం గమనార్హం. టెన్త్ క్లాస్ తర్వాత పూణెలోని ఓ హోటల్‌లో రిసెప్షనిస్టుగా పని చేసిన దీపక్.. ఆ తర్వాత త్రీస్టార్ హోటల్‌లో ఉద్యోగంలే చేరి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.