Roman: రష్యా మంత్రి రోమన్ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య వార్ ఇంకా ఆగలేదు. ఉక్రెయిన్ దాడులు చేస్తుందనే అనుమానంతో రష్యాలో వందలాది విమానాలు నిలిచిపోయాయి. కానీ విమానాలు రద్దు అవడంతో ప్రయాణాల విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ మొత్తం సంఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. వెంటనే యాక్షన్ లోకి దిగిపోయి రవాణా మంత్రి రోమన్ స్తారోవోయ్త్‌ను పదవి నుంచి తొలగించారు.
ఆయన స్థానంలో ఆంద్రే నికితిన్‌ను తాత్కాలిక రవాణాశాఖ మంత్రిగా నియమించారు. ఇది జరిగిన వెంటనే రోమన్ కొన్ని గంటల వ్యవధిలోనే శవమై తేలారు. ఆయన తనను తానే కాల్చుకున్నారని, కారులో మృతదేహం లభ్యమైందని రష్యా స్థానిక వార్త సంస్థలు ప్రచురించాయి. దీంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. రోమన్ స్తారోవోయ్త్ ఉక్రెయిన్ సరిహద్దులోని కర్స్క్ రీజియన్‌లో జన్మించారు. 2024 నుంచి రష్యా రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.