1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Tollywood Director Ram Gopal Varma comments on Russia - Ukraine war

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

ramgopalvarma
గుట్టుచప్పుడు కాకుండా రష్యాపై ఉక్రెయిన్ దాడి విధ్వంసం సృష్టించిన అంశంపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. 'సుమారు 3.8 కోట్ల జనాభా మాత్రమే ఉన్న ఉక్రెయిన్, అత్యంత అధునాతన క్షిపణులు లేకపోయినా, కేవలం చౌకగా దొరికే ఎఫ్పీ‌వీ డ్రోన్లతో (మనం ఇక్కడ సినిమా షూటింగులకు, పెళ్లిళ్లకు వాడే రకం) తమకన్నా 28 రెట్లు పెద్దదైన రష్యాను లక్ష్యంగా చేసుకుంది' అని తెలిపారు. 
 
ఈ దాడుల తీవ్రత గురించి వివరిస్తూ, 'ఈ చిన్న డ్రోన్ల ద్వారా ఉక్రెయిన్ దాదాపు 40 రష్యన్ బాంబర్ విమానాలను విజయవంతంగా ధ్వంసం చేసింది' అని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం తనకు ఒక పాత సినిమా డైలాగును ఆయన గుర్తుచేశారు. 
 
'నాకు 'టోరా టోరా టోరా' సినిమాలోని ఒక డైలాగ్ గుర్తొస్తోంది. పెరల్ హార్బర్ దాడి తర్వాత ఒక జపనీస్ కమాండర్ అమెరికా గురించి మాట్లాడుతూ, 'మనం నిద్రపోతున్న సింహాన్ని కదిలించాం' అంటాడు" అని ఆయన గుర్తుచేశారు.
 
ఈ పోలికను ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి అన్వయిస్తూ, రామ్ గోపాల్ వర్మ ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు. "మరి ఇప్పుడు ఉక్రెయిన్ కూడా అలా నిద్రపోతున్న సింహాన్ని (రష్యాను) కదిలించిందా? లేదా అసలు అది సింహమే కాదని నిరూపించిందా? అనేది కాలం మరియు రష్యానే చెప్పాలి," అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  
తర్వాతి కథనం
Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!