1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 9 ఏప్రియల్ 2025 (07:08 IST)

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Chiranjeevi, Surekha at Airport
Chiranjeevi, Surekha at Airport
మెగా స్టార్ చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్ నేటి తెల్లవారుజామున ఒంటిగంటకు సింగపూర్ బయలుదేరారు. ఈవిషయాన్ని ధ్రువీకరిస్తూ మెగా ఫ్యామిలీ పి.ఆర్. ఎయిర్ పోర్ట్ కు వస్తున్న వీడియోను విడుదల చేసింది. నిన్న రాత్రే మీడియాముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వేసవి కేంప్ లో భాగంగా జరిగే చిన్న పిల్లల ఈవెంట్ లో నా భార్యకూడా వుందని చెప్పారు.

చాలామంది పిల్లలున్నారు. అందులో కొందరికి వీపు, కాలు, చేతులు కాలాయి. పొగవల్ల ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఏర్పడింది. దురద్రుష్టవశాత్తు మా పిల్లాడి పక్కనే వున్న చిన్నపాప చనిపోయింది.అందుకు నాకు చాలా బాధగా వుందని అన్నారు. అర్థరాత్రే నేను బయలుదేరి సింగపూర్  వెళుతున్నట్లు చెప్పారు.
 
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఒక తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ తక్షణమే సింగపూర్‌కి బయల్దేరారు.
 
శంకర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు మరియు మద్దతు అందించేందుకు సింగపూర్ బయలుదేరారు. మార్క్ శంకర్‌కు అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రష్యాలో పుట్టిన అన్నా లెజ్నెవా ను వివాహం చేసుకున్న విషయంతెలిసిందే. వారికిపుట్టిన కుమారుడే మార్క్. కాగా, ఈ సంఘటన జరిగిన రోజే పెద్ద కుమారుడు జన్మదినం కావడం విశేషం. ఇదే విషయాన్ని పవన్ చెబుతూ, మా పెద్దబ్బాయి పుట్టినరోజునాడే రెండోవాడికి ఇలా జరగడం వింతగా వుందని అన్నారు.