హిమాచల్ ప్రదేశ్ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?
హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. జూన్ 20 నుంచి జూలై 6 వరకు హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా వరదలు వచ్చాయి. ఏకంగా 23 సార్లు ఇక్కడి ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. ఇందులో 78 మంది వరకు చనిపోగా మరో 37 మంది గల్లంతయ్యారు.
ఈ వరదల్లో బ్యాంకు కొట్టుకుపోయింది. అక్కడి మండి జిల్లాలో తునాగ్ అనే ప్రాంతంలో ఒకే ఒక్క బ్యాంక్ ఉంది. ఆ జిల్లాలో ప్రజలందరూ అక్కడే డబ్బులు దాచుకుంటారు. ఆ బ్యాంక్ కాస్త వరదల్లో కొట్టుకుపోయింది.
ఆ బ్యాంక్ వరదల్లో దెబ్బ తినడంతో తమ డబ్బు, పేపర్లు, బంగారం అన్నీ ఏమయ్యాయో తెలియడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరదల్లో ఏవైనా కొట్టుకుపోయి, దోపిడీకి గురికావొచ్చని స్థానికులు కాపలాకాస్తున్నారు.