1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జులై 2025 (12:12 IST)

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

Boy on railway track
Boy on railway track
రీల్స్ పిచ్చి పెద్దా చిన్నా లేకుండా అందరికీ బాగా ముదిరిపోయింది. రీల్స్ కోసం సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా ఒడిశాలో ఓ బాలుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్ చేశాడు. ఆ బాలుడు రైలు వస్తుండగా ట్రాక్‌పై పడుకున్నాడు. 
 
ట్రైన్ వెళ్లిపోయేవరకూ ట్రాక్‌పై అతడు అలానే పడుకున్నాడు. అతని సాహసాన్ని అతడి స్నేహితులు వీడియో తీశారు. ఈ వీడియో చూసిన బౌద్ పోలీసులు ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 
 
ఈ సంఘటన పురునాపాణి రైల్వే స్టేషన్ సమీపంలోని దలుపాలి సమీపంలో జరిగింది. ఈ ప్రాంతంలో ఇటీవలే రైలు సేవలను ప్రవేశపెట్టారు. పోలీసులతో పాటు నెటిజన్లు కూడా ఈ భద్రతా ఉల్లంఘన ఘటనను ఖండించారు.