న్యూజిలాండ్ టూర్‌కు హార్దిక్ పాండ్యా.. 'భారత్ ఏ' జట్టులో కేఎల్ రాహుల్
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించి సస్పెన్షన్‌కుగురైన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై బీసీసీఐ నిషేధం ఎత్తివేసింది. ఆ వెంటనే వారికి జట్టులో చోటుకల్పించింది. ముఖ్యంగా, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమిండియాలోకి తీసుకున్నారు.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
అలాగే, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత 'ఏ' జట్టుకు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్ లయన్స్‌తో 'భారత్ ఏ' జట్టు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ జట్టుతో కేఎల్ రాహుల్ కలవనున్నాడు.