శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (16:36 IST)

కేంద్ర బడ్జెట్ 2019-20 హైలెట్స్...

కేంద్ర ఆర్థిక తాత్కాలిక మంత్రి పియూష్ గోయల్ 2019-20 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అనారోగ్యం కారణంగా అమెరికాలో ఉండటంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జ్ ఆర్థికమంత్రిగా పియూష్‌ గోయల్ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 
 
ఎన్డీయే ప్రభుత్వానికి ఇది ఆరో బడ్జెట్. ఎన్నికల నేపథ్యంలో గోయల్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ముందుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 
 
ప్రజలు తమకు పూర్తి మెజార్టీ ఇచ్చారన్నారు. భారత్‌ ఇమేజ్ పెరిగిందని, ఆత్మవిశ్వాసం పెరిగిందని, భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడిందని అన్నారు. ప్రతి ఒక్కరికి టాయిలెట్లతో కూడిన గృహ వసతి కల్పించడమే ధ్యేయమని గోయల్ స్పష్టంచేశారు. 
 
బడ్జెట్ పియూష్ గోయల్ హైలెట్స్... 
* క్లీన్‌ బ్యాంకింగ్‌ మా లక్ష్యం.
* రైతుల ఆదాయం రెట్టింపు. 
* వృద్ధిరేటు వేగం పుంజుకుంది. 
* ప్రజల ఆదాయం రెట్టింపు కావాలి. 
* జీఎస్టీ సహా పన్నుల సంస్కరణలపై దృష్టి. 
* ప్రపంచంలో మనది ఆరో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ.
* ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4.6 శాతానికే పరిమితం.
* ఉగ్రవాద, మతవాద రహిత దేశంగా అవతరించాలి. 
* యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం 10 శాతం దాటింది. 
* గత ఏడాది డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 2.19శాతం మాత్రమే. 
 
* 143 కోట్ల ఎల్ఈడీ బల్బులు అందించాం. 
* రూ.3 లక్షల కోట్ల మొండి బాకీలు వసూలు.
* రైతులకు కనీస మద్దతు ధర 50 శాతం పెంచాం. 
* అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాం. 
* చిన్న సన్నకారు రైతుల కోసం పీఎం కిసాన్‌ పథకం.
* రైతులకు యేడాదికి ఎకరాకు రూ.6 వేలు పంటసాయం. 
* ఆయుష్మాన్‌ భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం.
 
* ప్రత్యేక మత్స్యశాఖ ఏర్పాటు చేస్తాం. 
* కామధేను పథకానికి రూ.750 కోట్లు.
* దీని వల్ల 12 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ది.
* మొదటి విడతగా రూ.2 వేలు తక్షణమే ఇస్తాం.
* జీడీపీలో 42 శాతం శ్రామికుల నుంచే వస్తోంది.
* గోవుల సంతతి పెంచడానికి కామధేను పథకం.
* ప్రధానమంత్రి శ్రమ్‌ జ్యోతి మాన్‌ధన్‌ పేరుతో కొత్త పెన్షన్.
 
* కనీస పెన్షన్‌ రూ.3 వేలు.
* గ్రాట్యుటీ రూ.20 లక్షలకు పెంపు.
* కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు.
* రైల్వే క్యాపిటిల్‌ ఔట్‌లే రూ.64,500 కోట్లు.
* ముద్ర స్కీం కింద రుణాలకు రూ.7 లక్షల కోట్లు.
* 6 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం, 8 కోట్లకు పెంచుతాం.
* అసంఘటిత కార్మిక సంఘాలకు పింఛన్ కార్యక్రమం. 
* గ్రాట్యుటీ పరిధి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు.
 
* సౌరశక్తి ఉత్పత్తి 10 రెట్లు పెరిగింది. 
* స్టార్టప్స్‌లో దేశం రెండోస్థానంలో ఉంది.
* వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ త్వరలో పట్టాలు ఎక్కుతుంది.
* 2019-20లో రక్షణ బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లు దాటుతుంది.
* ఈఎస్‌ఐ పరిమితి రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంపు. 
* మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశాం.
 
* ఆన్‌లైన్‌ వ్యవస్థను పటిష్టం చేస్తాం.
* ఎనిమిదేళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్లవుతుంది.
* 2013-14 నాటితో పోల్చితే దాదాపు రెట్టింపయింది.
* ప్రత్యక్ష పన్నుల రాబడి రూ.6.38 లక్షల కోట్లకు పెరిగింది.
* రాష్ట్రాల పన్నుల వృద్ధిరేటు తగ్గితే లోటు కేంద్రం పూరిస్తుంది.
* వచ్చే ఐదేళ్లలో మనది 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ అవుతుంది.
 
* స్టాండెడ్‌ డిడక్షన్‌ రూ.50వేలకు పెంపు. 
* ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి 76,800 కోట్లు.
* జాతీయ విద్యా స్కీమ్‌కు రూ.38,570 కోట్లు.
* సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు.
* ఈశాన్య రాష్ట్రాలకు రూ.58,166 కోట్లు కేటాయింపు. 
* రెండిళ్లు ఉన్నప్పటికీ అద్దెపై పన్ను మినహాయింపు. 
* రూ.5 లక్షల వరకు పూర్తి ఆదాయ పన్ను మినహాయింపు. 
* ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ను మెరుగుపర్చేందుకు మౌలికసదుపాయాలు కల్పిస్తాం.
* పీఎఫ్‌ ఇతర సేవింగ్స్‌ స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేసేవారికి రూ.6.5 లక్షల వరకు మినహాయింపు.