గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:41 IST)

#BudgetSession2019 : ఉద్యోగులకు గుడ్‌న్యూస్ : రూ.5 లక్షల వరకు పన్ను లేదు...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు రూ.5 లక్షల వరకు పూర్తిగా పన్ను మినహాయించారు. ప్రస్తుతం రూ.2.50 లక్షల వరకు ఉంటే... ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. అంటే వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారు ఇక పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు. దీనివల్ల 3 కోట్ల మంది వేతనజీవులు, పెన్షనర్లు లబ్దిపొందనున్నారు. మిగిలిన శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
 
అలాగే, ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
ఈ ఏడాది జనవరి వరకు జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు చేరిందన్నారు. సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించామన్నారు. ప్రస్తుతం నెలకు రూ. 97,100 కోట్లు పన్ను వసూళ్లవుతున్నాయన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేర పెరిగాయని చెప్పారు.