శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:59 IST)

#Budget2019 : నెలకు రూ.100 చెల్లిస్తే... 60 యేళ్లు దాటితే రూ.3 వేల పించన్

కేంద్ర ప్రభుత్వం మరో జనాకర్షక పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి శ్రమ యోగి బంధన్ స్కీమ్ పేరుతో సరికొత్త పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అసంఘటిత కార్మికులకు పింఛన్ ఇవ్వనున్నట్లు కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 60 ఏళ్లు నిండిన వారందరికీ ఏటా రూ. 3 వేలు పింఛన్ వచ్చే విధంగా పథకాన్ని రూపకల్పన చేసినట్లు వివరించారు. 
 
18 యేళ్ల పైబడిన వారు నెలకు రూ.55, 39 యేళ్ల నిండిన వారు నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.3 వేల పింఛన్ ఇస్తామని ప్రటించారు. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగంలోని 10 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం వర్తించనుంది. ఇక గ్రాట్యుటీ పరిమితి రూ. 20 లక్షలకు పెంచారు. కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.2.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచారు. అంటే ఈపీఎఫ్ఓ సభ్యుడుగా ఉన్న వ్యక్తి చనిపోతే అతని కుటుంబానికి ఇచ్చే బీమాను రూ.2.50 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచారు.