శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (07:34 IST)

ఇంజెక్షన్ వికటించి బాలుడు శరీరం నుంచి వేడిసెగలు.. మృతి

జ్వరానికి వేసిన ఇంజెక్షన్ వికటించింది. ఫలితంగా బాలుడు శరీరం నుంచి వేడి సెగలు వచ్చాయి. అంతేనా ఆ బాలుడు మెలికలు తిరిగిపోతూ తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని కాపుగల్లు అనే గ్రామంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కాపుగల్లు గ్రామానికి చెందిన బాడిశ నర్సింహారావు అనే వ్యక్తి కుమారుడు కార్తీక్(5)కు గత నెల రోజుల క్రితం డెంగ్యూ జ్వరం వచ్చి తగ్గిపోయింది. బుధవారం నర్సింహారావు ఓ ఫంక్షన్ వెళ్లవలసి ఉంది. 
 
ఈ క్రమంలో కార్తీక్‌కు మళ్లీ జ్వరం వచ్చింది. దీంతో ఇంటికి సమీపంలో ఉన్న ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్ళి ఇంజెక్షన్ వేయించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి బాలుడు శరీరం నుంచి వేడిసెగలు రావడంతోపాటు మెలికలు తిరుగుతుండటంతో తల్లిదండ్రులు బాలుడిని గ్రామంలోని మదో వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. 
 
బాలుడి తీరు పరిశీలించి వెంటనే కోదాడ పెద్ద దవాఖానకు తరలించాలని సలహా ఇవ్వడంతో ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బాలుడికి రెండు రోజులుగా జలుబు, జ్వరం ఉండడంతో అదే ఇంజక్షన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి స్థానిక వైద్యుడితో ఇప్పిస్తున్నారు. బుధవారం అనుకోకుండా ఈ ఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురై కన్నీటి పర్యంతమయ్యారు.