ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (13:52 IST)

విద్యార్థినిని కోర్కె తీర్చమన్న పాస్టర్...

ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా అన్న చందంగా ఎన్ని చూస్తున్నా... ఎన్ని జరుగుతున్నా... కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. కాకపోతే స్థలం, బాధితులు, సంబంధిత వ్యక్తులు మాత్రమే మారుతున్నారు. తాజాగా మరో అత్యాచార ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
వివరాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో ఓ విద్యార్థినిపై పాస్టర్ దారుణంగా ప్రవర్తించాడు. దమ్మపేట సెయింట్‌ మెరీస్‌ స్కూల్‌లో 9వ తరగతి చదవుతున్న సదరు విద్యార్థినిని పాస్టర్ లైంగికంగా వేధింపులకు గురిచేయడంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాస్టర్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.