సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:07 IST)

మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి రిలీజ్ డేట్ క‌న్ఫ‌ర్మ్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, వైజ‌యంతీ మూవీస్, పి.వి.పి సినిమా బ్యాన‌ర్స్ పైన ఈ సినిమా రూపొందుతోంది. మ‌హేష్ బాబుకు ఇది 25వ చిత్రం కావ‌డం విశేషం. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. మార్చి 15 నాటికి రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌వుతుంది. మ‌రోవైపు శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది.
 
అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుద‌ల చేయ‌నున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. భారీ తారాగ‌ణం న‌టిస్తోన్న ఈ మ‌హ‌ర్షి చిత్రం హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతోంది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తోన్న ఈ సూప‌ర్ మూవీకి కె.యు. మోహ‌న‌న్ సినిమాటోగ్ర‌ఫీ నిర్వ‌హిస్తున్నారు. హ‌రి, సాల్మ‌న్, సునీల్ బాబు, కె.ఎల్.ప్ర‌వీణ్, రాజు సుంద‌రం, శ్రీమ‌ణి, రామ్ ల‌క్ష్మ‌ణ్ ప‌ని చేస్తున్న ముఖ్య సాంకేతిక వ‌ర్గం. ద‌ర్శ‌క‌త్వం - వంశీ పైడిప‌ల్లి.