శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (16:07 IST)

మహేష్ బాబుతో ఫిదా హీరోయిన్ రొమాన్స్

విభిన్న పాత్రలను ఎంచుకుని.. మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న ''ప్రేమమ్'' హీరోయిన్ సాయిపల్లవి ప్రస్తుతం.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. మహేష్ బాబు 26వ సినిమాలో సాయిపల్లవి నటించే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ప్రస్తుతం మహేష్ బాబు తన 25వ సినిమాను ''మహర్షి''గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా తర్వాత 26వ చిత్రాన్ని మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. 
 
ఈ సినిమాలో సాయిపల్లవి మహేష్ జోడీగా నటిస్తుందని టాక్. దర్శకుడు అనిల్ రావిపూడి సాయిపల్లవితో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ వ్యవహరిస్తారని సమాచారం.