మహర్షి విడుదల తేదీ వాయిదా..!
సూపర్ స్టారర్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నారు. అందులో మహేష్ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో మహేష్ ఫస్ట్‌లుక్.. ఫ్యాన్స్‌కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఎప్పుడు సినిమా విడుదలవుతుందానని వేచి చూస్తున్నారు. కానీ, విడుదల తేదీ వాయిదా పడడంతో ఫ్యాన్స్ చాలా అసహానికి లోనవుతున్నారు. ఇది మహేష్ 25వ సినిమా కావడంతో మరింతి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి విడుదల తేది మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికావడానికి మరింత సమయం పడుతుందన్న ఆలోచనతో విడుదల కొద్ది రోజుల వాయిదా వేసె ఆలోచనలో ఉన్నారట మహర్షి యూనిట్. ఏప్రిల్ 25న కాకుండా మే 9న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.