శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (15:49 IST)

పుచ్చకాయలోని ఆ తెలుపు భాగాన్ని పురుషులు తింటే?

వేసవిలో పుచ్చకాయను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. వేసవిలో దొరికే పండ్లను తీసుకోవడం ద్వారా వేసవి తాపం నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. కిడ్నీకి పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండంలోని మలినాలను తొలగిస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే శరీరంలోని మలినాలను తొలగించుకోవాలంటే.. పుచ్చకాయ ముక్కలను రోజు రెండు కప్పులైనా డైట్‌లో చేర్చుకోవాలి. 
 
వేసవిలో చెమట రూపంలో నీరు వెలుపలికి వచ్చేయడంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం వుంది. అందుచేత పుచ్చకాయల్ని వేసవిలో నాలుగైదు కప్పులైనా రోజుకు తీసుకోవాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రక్తంలో నీటి శాతం తగ్గిపోతే.. రక్తప్రసరణ మెరుగ్గా వుండదు. అలాంటి సమయంలో పుచ్చను తింటే రక్తంలో నీటి శాతం చేరి.. రక్త ప్రసరణ మెరుగవుతుంది. తద్వారా శరీరానికి కొత్త ఉత్సాహం చేకూరుతుంది. 
 
శరీరానికి చలవనిస్తుంది. ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. ఇందులోని ఐరన్, విటమిన్లు ఫాస్పరస్, క్యాల్షియం వంటి ధాతువులు.. వేసవిలో శరీరానికి ఎంతో అవసరం. పుచ్చలోని సిట్రుల్ ధాతువులు పుచ్చకాయలోని ఎరుపు భాగంలో కాకుండా తెలుపు రంగులో వుండే తోలు భాగంలో పుష్కలంగా వుంటాయి. 
 
ఇంకా పుచ్చకాయలోని ఎరుపు భాగాన్ని మాత్రమే తిని.. వద్దని పారేస్తున్న తెలుపు చెక్కను తినడం ద్వారా పురుషుల్లో వీర్యవృద్ధి జరుగుతుంది. వీర్యలోపాలు తొలగిపోతాయి. పుచ్చకాయలను రోజూ ఆహారంలో భాగం చేయడం ద్వారా రక్తపోటు తగ్గుతుంది. హృద్రోగ వ్యాధులు దరిచేరవు. సులభంగా బరువు తగ్గుతారు. ఒబిసిటీని సులభంగా పారద్రోలవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
 
ఇంకా పుచ్చకాయ గింజలు మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేస్కుంది. డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలను నిత్యం తింటుంటే రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. హైబీపీ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలను తింటే బీపీ తగ్గుతుంది. పుచ్చకాయ విత్తనాలను రోజూ తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. అలసట తగ్గుతుంది.
 
మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాల పొడిని అరస్పూన్ తీసుకుంటే సరిపోతుంది. పుచ్చకాయ విత్తనాల పొడి కంటి చూపును మెరుగుపరిచే దివ్యౌషధంగా పనిచేస్తుంది.