సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (12:30 IST)

మహేశ్‌ బాబుకు నో చెప్పిన హీరోయిన్... కారణం అదేనా?

టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబుతో నటించడానికి దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఏ హీరోయిన్ అయినా భవిస్తారు. ఇక కొంత మంది హీరోయిన్లు అయితే ఒక్క సినిమాలో అయినా ఆయన పక్కన చేయాలని తపిస్తూ ఉంటారు. కానీ ఓ సినిమాలో ప్రిన్స్‌కు జోడీగా నటించే అవకాశం వస్తే ఒక హీరోయిన్ నో చెప్పిందని సినీ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు సాయి పల్లవి అంట.
 
మహర్షి సినిమా తర్వాత ప్రిన్స్ మహేష్ తదుపరి సినిమా కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవిని సెలెక్ట్ చేసిందట చిత్రం యూనిట్. సాయి పల్లవి పేరును స్వయంగా మహేశ్ చెప్పడంతో దర్శకుడు అనిల్ రావిపూడి సాయిపల్లవికి కథ చెప్పగా ఆమె నో చెప్పిందట. 
 
గతంలో కూడా ఈమె చాలా డైరెక్టర్లకు నో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తన రోల్ ప్రాధాన్యత గురించి ఆలోచించి సాయి పల్లవి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. అలా చేసినా కూడా మారి 2, పడి పడి లేచే మనస్సు నిరాశపరచడంతో సినిమా ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడుతోందట. ఇక సాయి పల్లవి నో చెప్పడంతో రష్మిక మందాన, కత్రినా కైఫ్ పేర్లు వినిపిస్తున్నాయంట.