శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (12:13 IST)

ప్రభాస్ బుగ్గపై సున్నితంగా కొట్టిన లేడీ అభిమాని

'బాహుబలి' సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు అంతర్జాతీయంగా గుర్తింపురావడంతో పాటుగా ఫ్యాన్స్ కూడా బాగా పెరిగారు. మరీ లేడీ ఫ్యాన్స్ విషయం అయితే చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరోను కలుసుకోవాలని, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని, వారితో ఫోటో దిగాలని ఆశపడుతుంటారు. ఇటువంటి ఒక వీరాభిమానికి ప్రభాస్ ఎదురయ్యాడు. ఇక ఆమె సంతోషం పట్టలేక చేసిన అల్లరికి సంబంధించిన వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
 
లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రభాస్ వెళ్తుండగా అతనికి ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎదురైంది. ఇక అందరూ ఫోటోలు దిగడానికి సిద్ధమైపోయారు. అందులో ఓ వీరాభిమాని ప్రభాస్ పక్కన నిల్చుని ఫోటో తీస్కున్నాక వెళ్లూ వెళ్తూ ప్రభాస్ బుగ్గ గిల్లీ మరీ గంతులేస్తూ వెళ్లింది. ఆమె ముఖంలో కనిపించిన ఆనందం చూస్తే ఆమెకు ప్రభాస్ అంటే ఎంత అభిమానమో తెలుస్తోంది. ఇలాంటి క్రేజీ సంఘటనలు సెలబ్రిటీలకు ఎదురుకావడం సాధారణమే. ఈ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుని సంబరపడిపోయింది.