అక్క వద్దకెళితే... బావ గర్భవతిని చేశాడు...
ఓ కామాంధుడు భార్య చెల్లెలిపై మససుపడ్డాడు. అక్క లేని సమయంలో బాలికను లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఆమె ఇప్పుడు మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అనంతపురంలో వసతి గృహంలో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుకుంటోంది.
అక్కా బావల ఇల్లు కూడా అనంతపురంలోనే ఉండటంతో తరచూ వాళ్ల ఇంటికి వస్తుండేది. భార్య లేని సమయంలో అదను చూసి మరదలిని వశపరచుకున్నాడు. వాంఛ తీర్చుకుని గర్భవతిని చేశాడు. గర్భవతి అని తెలుసుకున్న బాధితురాలు ఆరోగ్యం బాగా లేదని కాలేజీలో చెప్పి తన ఊరు వచ్చేసింది. అప్పటి నుండి తన తల్లిదండ్రులతో ఇంట్లోనే ఉంటోంది.
ఆదివారం రాత్రి ప్రసవ వేదన పడుతుండటంతో అంబులెన్స్‌లో అనంతపురానికి తీసుకువెళుతుండగా మగ శిశువుకు జన్మనిచ్చింది. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.