శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (09:35 IST)

ఆ కిరాతకుడు చేసిన పనికి రవళి చనిపోయింది...

ఓ కిరాతకుడి దుశ్చర్యకు రవళి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ రాంగనర్‌లో ఫిబ్రవరి 27వ తేదీన లలితా రెడ్డి హాస్టల్‌ ముందు తోపుచర్ల రవళి (22) అనే యువతిపై ప్రేమోన్మాది పెండ్యాల సాయి అన్వేష్‌ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవళి... గత వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచింది. 
 
హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో ఆరు రోజుల పాటు నరకయాతన అనుభవించి చివరకు రవళి ప్రాణాలను వదిలింది. పెట్రోల్‌ దాడిలో గాయపడిన రవళి ముఖం ఎక్కువ మొత్తంలో కాలిపోయింది. తీవ్రమైన గాయాల వల్ల శ్వాసనాళాలు ఉబ్బిపోయాయి. చర్మంపై ఉన్న మూడు పొరలు పూర్తి స్థాయిలో దెబ్బతిని, ఊపిరితిత్తులు పాడైపోయాయి. ప్లేట్‌లేట్స్‌ తగ్గిపోయాయి. శ్వాస నాళాలు దెబ్బతినడం వల్ల శ్వాస తీసుకోలేక మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.