సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (13:59 IST)

స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి బాలుడు మృతి

స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇంజపూర్‌లో చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయస్సున్న బాలుడిని గురువారం ఉదయం కమ్మగూడా లోటస్ లాప్ స్కూల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా నేరుగా వెళ్లిపోయాడు.
 
బాలుడికి తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం బాలుడి తల్లిదండ్రులు, బంధువులు మృతం దేహాన్ని స్కూలు ముందు ఉంచి ఆందోళనకు దిగారు. అయితే ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా స్కూలు యాజమాన్యం స్కూలు గేటుకు తాళం వేసి, షట్టర్ మూసివేసి స్కూలును నడుపుతున్నారు. ఈ ఘటన గురించి, వారు చేస్తున్న ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.