సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (10:04 IST)

దివ్యాంగ బాలికపై బంధువు అత్యాచారం

బంధువు అని నమ్మి సాయం అడిగినందుకు ఆ మానవమృగం బాలిక శీలంపై కాటేశాడు. 13 యేళ్ళ దివ్యాంగ బాలికపై బంధువు అత్యాచారం జరిపాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 13 యేళ్ళ దివ్వాంగ బాలిక ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో శనివారం ఇంటికి వచ్చింది. 
 
సోమవారం నుంచి స్కూలు కావడంతో తన ఇంటి పక్కనే ఉండే వరుసకు మామ అయ్యే బొక్కా మరియదాసు అలియాస్ కోటేశ్వర రావుతో ఆ బాలికను హాస్టల్‌కు పంపించింది. కానీ, ఆ బాలికపై కన్నేసిన ఆ కామాంధుడు హాస్టల్‌కు తీసుకెళ్లకుండా నకరికల్లు శివారు ప్రాంతమైన ఎన్నెస్సీ కాలువ కట్ట వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తోటి స్నేహితురాళ్ళకు చెప్పింది. వారు బాలిక బంధువులకు సమాచారం చేరవేయగా, వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టాన్ని ప్రయోగించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.