1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Lakshmis NTR Release Details

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కానుందా... లేదా...??

Lakshmis NTR
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పలు వివాదాలతో తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ని నిలిపివేయాలని కోరుతూ తెదేపా కార్యకర్త దేవీబాబు చౌదరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉందనీ ఆయన తన ఫిర్యాదులో పేర్కొంటూ ఈ నెల 22న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆపాలని కోరారు. 
 
సినిమాలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను నెగిటివ్‌గా చూపించారనీ, తత్ఫలితంగా ఇది ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ చిత్రం విడుదలను ఏప్రిల్‌ 11వ తేదీ వరకు నిలిపివేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ ఫిర్యాదుని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ... పరిశీలన నిమిత్తం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపినట్లు సమాచారం.
About Writer
వాసుదేవన్
తర్వాతి కథనం
పులిజూదం ట్రైలర్ అదుర్స్... (video)