శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (12:07 IST)

అమ్మతనం గురించి సమంత కామెంట్స్

అక్కినేని సమంత... రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘మజిలీ’ ప్రచార కార్యక్రమాలలో ప్రస్తుతం బిజీగా ఉంటున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి తర్వా నాగచైతన్య, సమంత కలిసి నటించిన తొలి చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకుల్లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 
 
కాగా... ఈ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత తాను తల్లి కావడంపై స్పందిస్తూ... ‘ఒకవేళ నేను తల్లినైతే, నటన నుండి విరామం తీసుకుంటాను. అప్పుడు నా బిడ్డే నాకు ప్రపంచం అవుతుంది. నా చిన్నతనంలో నేను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వాటిని ఇప్పుడు నా బిడ్డ ఎదుర్కోకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే బిడ్డ పుడితే నేను నటనను పక్కన పెడతాను’ అంటూ చెప్పుకొచ్చారు. అమ్మతనం గురించి మాట్లాడిన సమంత.. తాను ఎప్పుడు తల్లి కావాలనుకుంటున్నది మాత్రం చెప్పలేదు.
 
గత ఏడాది సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాపాయి కోసం తాను ఒక టైమ్‌లైన్‌ను సెట్ చేసుకున్నానని చెప్పుకొచ్చారు. ‘నాకు బిడ్డ ఎప్పుడు కావాలో నిర్ణయించుకున్నాను. తేదీ కూడా ఖరారు చేసుకున్నాను. కానీ, ఆయన అనుకున్న తేదీకే బిడ్డ పుట్టాలని నాగచైతన్య భావిస్తున్నారు’ అని అప్పట్లో వెల్లడించారు. ఇంతకీ సమంత ఏ తేదీ అనుకున్నారో తెలీదు కానీ.. అప్పటి నుండి ఆవిడ నటనకు స్వస్తి పలకడం మాత్రం ఖాయమనే అనిపిస్తోంది.