శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (19:38 IST)

రమ్యకృష్ణ ఏంటి అలా చేసింది? సెట్‌లో వాళ్లు అవాక్కయ్యారు...(video)

త్యాగరాజన్‌ కుమారరాజ దర్శకత్వం వహిస్తున్న 'సూపర్‌ డీలక్స్' చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని చూసి సెట్‌లో ఉన్నవారు షాకయ్యారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి స్వలింగ సంపర్కుడి పాత్రని పోషించగా, రమ్యకృష్ణ శృంగార తారగా నటించారు. కాగా... ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
కాగా... ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. ట్రైలర్‌లో రమ్యకృష్ణ పాత్ర అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. నీలాంబరి (నరసింహా సినిమాలో రమ్యకృష్ణ పాత్ర), శివగామి (బాహుబలి)వంటి పవర్‌ఫుల్‌ పాత్రలలో నటించిన రమ్యకృష్ణ ఇందులో శృంగార తారగా నటించడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాలోని తన పాత్ర గురించిన పలు ఆసక్తికర విషయాలను రమ్యకృష్ణ వెల్లడించడం జరిగింది.
 
'సూపర్‌ డీలక్స్' సినిమాలో నటీనటుల కంటే కంటెంట్‌దే ప్రధాన పాత్ర. దర్శకుడు కుమారరాజా తాను అనుకున్నట్లే చాలా బాగా తెరకెక్కించారు. ఇందులో నేను వేశ్య పాత్రలో నటించాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ ఓ ఎత్తైతే.. ఈ పాత్ర మరో ఎత్తు. సినిమాలో నేను నటించాల్సిన ఓ సన్నివేశానికి ఏకంగా 37 టేక్‌లు తీసుకున్నా. ఆ సన్నివేశం పూర్తిచేయడానికి రెండు రోజులు పట్టింది. అది చూసి నాకంటే.. నా అసిస్టెంట్లు, సెట్‌లో ఉన్నవారే షాకయ్యారు.  కొన్ని పాత్రలను డబ్బు కోసం చేస్తాం. మరికొన్ని పాపులారిటీ కోసం, పేరు కోసం చేస్తాం. ఇంకొన్ని ఇష్టంతో చేస్తాం. ఈ సినిమాను మాత్రం నేను ఇష్టపడే చేశాను' అని వెల్లడించారు.