శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (20:09 IST)

'గల్లీ బాయ్‌'కు సెన్సార్ దెబ్బ.. మరీ ఇన్ని కత్తెర్లా.. కారణమేంటి?

ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన "గల్లీ బాయ్" సినిమా నిర్మాణం పూర్తి చేసుకుని సెన్సార్ దశకు చేరుకుంది. ముందుగానే ఈ సినిమా ప్రమోషన్స్‌లో ముగిసిపోయిన వీరిద్దరీ వివిధ కార్యక్రమాలకు హాజరై ప్రజల్లో హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో ముద్దు సీన్‌ను చూపించడం ద్వారా సినిమాపై ఆసక్తి పెంచారు చిత్ర యూనిట్.
 
సెన్సార్ బోర్డ్ ఈ సినిమాపై మండిపడింది. ఇందులో బూతు పదాలు ఎక్కవగా వాడినట్లు, ఇక ముద్దు సీన్లు, రొమాన్స్ శృతి మించడంతో అనేక కత్తెర్లు పడ్డాయి. పైన చెప్పిన ట్రైలర్ ముద్దు సీన్‌ను తొలగింపుకు గురైంది. 13 సెకన్ల పాటు సాగే ఈ ముద్దు సన్నివేశం తీసివేయడమనేది సినిమాకు పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. 
 
ముంబైలో ఓ మురికివాడలో ఉండే యువకుడు రాపర్ కావాలని తపనపడే కథాంశంలో జోయా అక్తర్ సహజంగా ఉండటం కోసం ఇందులో చెప్పడానికి వీల్లేని పచ్చి బూతులు వాడారు, వాటన్నింటినీ బీప్ చేయాలని లేదా వేరే పదాలతో రీప్లేస్ చేయాలని సూచించడం జరిగింది. అలాగే బ్రాండ్ పార్ట్‌నర్‌గా పెట్టిన ప్రముఖ లిక్కర్ కంపెనీ లోగో కూడా తీసివేయాలని ఆదేశించారు. చివరిగా దీనికి యు/ఎ సర్టిఫికెట్ అందించారు.