గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 31 డిశెంబరు 2018 (16:40 IST)

నన్ను అలా చూస్తే.. నాన్న చంపేస్తారు.. జాన్వీ కపూర్

బాలీవుడ్‌ అందాల సుందరి, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తొలి సినిమా దఢక్ ద్వారా మంచి మార్కులు కొట్టేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా పడినా.. జాన్వీ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఇదే ఊపులో అమ్మడుకు వెతుక్కుంటూ అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. 
 
తాజాగా.. మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కే బయోపిక్‌లో జాన్వీ నటించనుంది. ఇందుకోసం జాన్వీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పైలట్‌ దుస్తుల్లో జాన్వి ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి
 
ఈ చిత్రంతో పాటు కరణ్ జోహార్ నిర్మించనున్న మల్టీ స్టారర్ మూవీ "తఖ్త్"లో కూడా నటించడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో.. జాన్వీ అంతర్జాతీయ మ్యాగజైన్‌కు ఫోటో షూట్ ఇచ్చారు. ఈ ఫోటో షూట్ కోసం జుట్టును జాన్వీ పొట్టిగా కత్తిరించుకుంది. అయితే తాను ఇలా జుట్టు కత్తిరించుకున్న విషయం తన తండ్రి బోనీ కపూర్‌కు తెలీదని.. జుట్టు కత్తిరించానని తెలిస్తే.. చంపేస్తారని జాన్వీ తెలిపింది.