బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (12:10 IST)

ట్రెండింగ్‌లో అర్జున్ రెడ్డి.. కారణం.. జాన్వీ కపూర్..?

అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ తాజాగా సోమవారం ట్రెండింగ్‌లో నిలిచాడు. విజయ్ దేవర కొండ టాప్ ట్రెండింగ్‌లో స్థానం సంపాదించుకునేందుకు దివికేగిన అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ కారణం. సోమవారం ట్రెండ్స్‌ జాబితాలో విజయ్ దేవరకొండ అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో జాన్వీ కపూర్ పాల్గొంది. 
 
ఈ ఎపిసోడ్‌లో జాన్వీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి చెప్పుకొచ్చింది. తాను మగాడిగా మారితే విజయ్ దేవరకొండలా మారుతానని.. అతడే అతి తక్కువ కాలంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాడని తెలిపింది. విజయ్ దేవరకొండ నటనా నైపుణ్యం గల నటుడని కొనియాడింది. అర్జున్ రెడ్డితో వేలాది ఫ్యాన్సును సొంతం చేసుకున్నాడని ప్రశంసించింది. దీంతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడని గుర్తు చేసుకుంది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీలో రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో కబీర్ సింగ్, షాహిద్ కపూర్ నటిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తానని కూడా జాన్వీ చెప్పేసింది. కాగా జాన్వీ కపూర్ దఢక్ అనే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఇప్పటికే హీరోయిన్‌గా పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా జాన్వీ మంచి మార్కులు కొట్టేసింది.