సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 3 నవంబరు 2018 (10:33 IST)

టాక్సీవాలాకు కలిసొచ్చే మాళవిక నాయర్... అర్జున్ రెడ్డి ఖాతాలో మరో హిట్?

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో మాస్ హీరోగా మంచి పేరు కొట్టేసిన విజయ్ దేవరకొండ.. తాజాగా టాక్సీవాలా సినిమాతో తెరపైకి వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు నటి మాళవిక నాయర్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
నటి మాళవిక నాయర్ ''టాక్సీవాలా'' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కథంతా మాళవికా నాయర్ చుట్టే తిరుగుతుందని టాక్. ఇప్పటిదాకా మాళవిక నటించిన సినిమాలన్నీ మంచి హిట్ కావడంతో టాక్సీవాలా కూడా హిట్ కొట్టడం ఖాయమని సినీ  పండితులు జోస్యం చెప్పేస్తున్నారు. అంతేకాకుండా ఆమె గోల్డెన్ లెగ్ ఈ సినిమాకి కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.
 
టాక్సీవాలాలో విజయ్ దేవరకండా సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా కనిపిస్తుండగా.. ముఖ్య పాత్రలో మాళవిక కనిపించనుంది. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నటించింది మాళవిక. ఆ సినిమాలో ఇద్దరు స్నేహితులుగా కనిపిస్తారు. 
 
ఈ సినిమాలోనూ మాళవకి విజయ్‌తో కలిసి నటిస్తే.. హిట్ ఖాయమని సినీ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. గీతా2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాతో రాహుల్ సాంక్రిత్యన్ అనే దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం కానున్నాడు.