బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (14:47 IST)

అల్లుడు కోసం చిరంజీవి.. అతని కోసం బాలయ్య.. ఒకే వేదికపై అగ్ర హీరోలు

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం "విజేత". ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించగా, సాయి కొర్రపాటి నిర్మాత. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరుగనుంది.

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం "విజేత". ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించగా, సాయి కొర్రపాటి నిర్మాత. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరుగనుంది. ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవి, మరో అగ్రనటుడు బాలకృష్ణలు ఒకే వేదికను పంచుకోనున్నారు.
 
చాలాకాలం తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనున్నారు. దీనికి కారణం లేకపోలేదు. తన అల్లుడు కళ్యాణ్‌ను తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు విజేత ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవీ వస్తున్నారు. అలాగే, బాలకృష్ణ రావడానికి కూడా కారణం ఉంది. ఈ చిత్రం వారాహి సంస్థ అధినేత సాయి కొర్రపాటి ... బాలయ్య బాబుకు మంచి స్నేహితుడు. ఈ కారణంగా ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఒకే వేదికపై ఆశీనులు కానున్నారు. 
 
ఇదే క‌నుక నిజ‌మైతే విజేత సినిమాకి కావ‌ల‌సినంత ప్ర‌మోష‌న్ రావ‌డంతో పాటు ఇటు మెగా అభిమానుల‌కి, ఇటు నంద‌మూరి అభిమానుల ఆనందానికి హ‌ద్దే లేకుండా పోతుంది. 'విజేత' చిత్రంలో మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించగా, సినిమా జూలైలో విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక ఈనెల 24వ తేదీన జరుగనుంది.