శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (19:32 IST)

చిరంజీవి చిన్నల్లుడి సినిమా ఈగ రిలీజ్ సెంటిమెంటుతో రెడీ

చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం విజేత‌. ఈ చిత్రానికి రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్ పైన సాయి కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. క‌ళ్యాణ్ దేవ్‌కు జంట‌గా మాళ‌విక నాయ‌ర్ న‌టించారు.

చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం విజేత‌. ఈ చిత్రానికి రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్ పైన సాయి కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. క‌ళ్యాణ్ దేవ్‌కు జంట‌గా మాళ‌విక నాయ‌ర్ న‌టించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన విజేత టీజ‌ర్‌కు  మంచి స్పంద‌న ల‌భిస్తోంది. 
 
యూత్‌కి బాగా క‌నెక్ట్ అయ్యేలా రూపొందిన ఈ సినిమాని జులై 6న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే... ఈ చిత్రాన్ని జులై 6నే రిలీజ్ చేయ‌డానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉందంటున్నారు. 
 
అది ఏంటంటే... జులై 6నే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈగ సినిమా రిలీజైంది. ఈ సినిమాని వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్ పైన సాయి కొర్ర‌పాటి నిర్మించారు. ఈగ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అందుచేత ఆ సెంటిమెంట్ వ‌ల్లే జులై 6న విజేత చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. మ‌రి.. ఈ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో చూడాలి..!