శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (12:58 IST)

'సైరా'లో హాలీవుడ్ యాక్షన్ ఎపిసోడ్.. రంగంలోకి గ్రెగ్ పావెల్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహా రెడ్డి". సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార వంట

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహా రెడ్డి". సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార వంటి అగ్రనటీనటులు నటిస్తున్నారు. ఈచిత్రానికి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాత.
 
ఈ సినిమా ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలో చాలా కీలకమైన సందర్భంలో వచ్చే యాక్షన్ సీన్ ఇది. దీంతో ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ గ్రెగ్ పావెల్‌ను రంగంలోకి దింపారు. 
 
ఈయన 'స్కై ఫాల్', 'హ్యారీ పోటర్' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను సైరా కోసం చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్‌లో వుండనున్నాయని బ్రహ్మాజీ ట్వీట్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది.