సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 6 జూన్ 2018 (19:09 IST)

చిరంజీవి కొత్త సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

మెగ‌స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా అనే సినిమా చేస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగ

మెగ‌స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా అనే సినిమా చేస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.... చిరంజీవి కొత్త సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ చిరంజీవితో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. 
 
ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నార‌ట‌. ఒక రోల్‌లో ఎన్నారైగా క‌నిపించ‌గా, మ‌రో రోల్‌లో రైతుగా క‌నిపిస్తార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం కొర‌టాల ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే ప‌నిలో ఉన్నారు. ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో ఈ సినిమా ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే... చిరు, కొర‌టాల కాంబినేష‌న్లో రూపొందే ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని నిర్మించేది ఎవ‌రనేది తెలియాల్సి వుంది. చిరు డ్యూయ‌ల్ రోల్ చేయ‌డం క‌నుక నిజ‌మైతే... మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే..!