సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 1 జూన్ 2018 (17:33 IST)

చిరంజీవి 'సైరా' లుక్‌తో కొరటాల చిత్రానికి చిరు 'సై'

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 'సైరా' సినిమా షూటింగు పూర్తికావడానికి చాలా సమయం పడుతుందని తన అభిమానులకు ఇంత గ్యాప్ రాకూడదని భావించాడు. దీని కారణంగా కొరటాల దర్శకత్వంలో రూపొందనున్న సినిమాను కూడా త్వరగా పూర్తిచేసి సెట్స్ పైకి తీసుకురావాలని చిరంజీవి

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 'సైరా' సినిమా షూటింగు పూర్తికావడానికి చాలా సమయం పడుతుందని తన అభిమానులకు ఇంత గ్యాప్ రాకూడదని భావించాడు. దీని కారణంగా కొరటాల దర్శకత్వంలో రూపొందనున్న సినిమాను కూడా త్వరగా పూర్తిచేసి సెట్స్ పైకి తీసుకురావాలని చిరంజీవి నిర్ణయించుకున్నాడు. ఈ సైరా చిత్రం చారిత్రక నేపథ్యంతో కూడినదని ప్రస్తుతం ఈ సినిమా ఇంతవరకు 30 శాతం చిత్రీకరణకు మాత్రమే వచ్చిందని తెలిపారు.
 
అందుకు బదులుగా కొరటాల సినిమాను కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్లో చిరంజీవి సైరా సినిమాకు సంబంధించిన గెటప్‌ల విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉండాలని ముందుగానే కొరటాలకి తెలియజేశారట. మొత్తమ్మీద సైరా లుక్‌తో కొరటాల చిరంజీవితో ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తారో చూడాలి.