వర్మతో 'ఆఫీసర్' అందుకే ఒప్పుకున్నా... రజినీకాంత్ అల్లుడు అద్భుతమైన కథ చెప్పారు..
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ సినిమాలో నాగార్జున నటించారు. ఈ సినిమా గురించి నాగార్జున పలు విషయాలు తెలిపారు. వర్మ సినిమాలు బాగా తీస్తాడని, ఆఫీసర్ సినిమాలో నిజాయితీ వ్యవస్థపై గౌరవం ఉండే శివాజీరావు అ
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ సినిమాలో నాగార్జున నటించారు. ఈ సినిమా గురించి నాగార్జున పలు విషయాలు తెలిపారు. వర్మ సినిమాలు బాగా తీస్తాడని, ఆఫీసర్ సినిమాలో నిజాయితీ వ్యవస్థపై గౌరవం ఉండే శివాజీరావు అనే పోలిస్ ఆఫీసర్ కథను నాగార్జున వివరించాడు. ఈ సినిమాను వినగానే తండ్రీ కూతుళ్లు ఎమోషన్ తనను కట్టి పడేసిందని అందుకే ఆఫీసర్ చిత్రంలో నటించడానికి అంగీకరించానని తెలియజేశాడు.
నాగార్జున ఈ సినిమా విషయంలో వర్మకు ఎటువంటి షరతులు విధించలేదని, కాకపోతే తనలోని నైపుణ్యాన్ని వాడుకోమని చెప్పారు. వర్మకు స్టార్ హీరోలు డేట్లు ఇవ్వడానికి భయపడుతుంటే మీరెలా తనను నమ్మి ఇచ్చారని నాగార్జునను ప్రశ్నలు అడిగారు. కథ నచ్చితే తను ఎవరికైనా అవకాశం ఇస్తానంటూ చెప్పారు. ఇకపోతే ధనుష్ దర్శకత్వంలో సినిమా చేయడంపై మాట్లాడుతూ... మెుదటి ప్రపంచ యుద్ధంలో ఒక కథ విన్నానని, ఆ సినిమాను చేయమని సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ అడిగాడని తెలిపారు.
కానీ, ధనుష్ ఈ సినిమాను రజినీకాంత్ కోసం రాసుకున్నానని రాజకీయాల్లో ఆయన బిజీగా ఉండడంతో తనతో చేయలేకపోతున్నానని చెప్పాడని తెలిపాడట. ఇక్కడ ఫిలిమ్ ఇండస్ట్రీలో స్టార్ హిరోల సినిమాలకే భరోసా లేకపోతే, ఇక వారి పిల్లలకు ఎక్కడుంటుందని తెలిపి ఎవరైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుందని ఆఫీసర్ సినిమా హీరో నాగార్జున ప్రసంశించాడు. ఇక ఈ ఆఫీసర్ చిత్రాన్ని జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు.