శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (11:46 IST)

పోలీస్ క్రికెట్ లీగ్‌: ఎల్బీ స్టేడియంలో టాలీవుడ్ సెలెబ్రిటీతో మ్యాచ్

పోలీస్ క్రికెట్ లీగ్‌లో గెలిచిన జట్టుతో టాలీవుడ్ సినిమా టీమ్ ఆదివారం తలపడనుంది. ఈ సెలబ్రిటీల జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులు వున్నారు. ఈ మ్యాచ్‌ ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రారంభ

పోలీస్ క్రికెట్ లీగ్‌లో గెలిచిన జట్టుతో టాలీవుడ్ సినిమా టీమ్ ఆదివారం తలపడనుంది. ఈ సెలబ్రిటీల జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులు వున్నారు. ఈ మ్యాచ్‌ ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రారంభం కానుంది. 
 
తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో భాగంగా జరిగిన హైదరాబాద్ పోలీసు క్రికెట్ లీగ్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఈ పోటీ జరుగుతుందని, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 5.3గంటల నుంచి జరిగే మ్యాచ్‌ని చూసేందుకు ప్రవేశం ఉచితమని, క్రీడాభిమానులు తరలి రావాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. 
 
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అఖిల్, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, నితిన్, నాని తదితరులు ఆడతారని చెప్పారు. ఇప్పటివరకు 270 జట్ల నుంచి 4050 మంది ఆటగాళ్లు పోటీల్లో పాల్గొన్నానని చెప్పుకొచ్చారు.